Indo-China: ఎలక్ట్రానిక్స్ తయారీలో రంగంలో చైనా పెట్టుబడులకు సానుకూల సంకేతాలిచ్చిన భారత్
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:17 PM
ఎలక్ట్రానిక్స్ తయారీలో రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం భారత్.. చైనాకు సానుకూల సంకేతాలను పంపుతోంది. తాజాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ రంగానికి మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ, జూలై 25 : ఎలక్ట్రానిక్స్ తయారీలో రంగంలో చైనా పెట్టుబడులకు భారతదేశం సానుకూల సంకేతాలను పంపుతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేలా అడుగులు వేస్తున్నందున ఇది సాకారమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనాది పైచేయి. చైనా ప్రస్తుతం ఈ రంగంలో 60% ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ క్రమంలో భారత్ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. కావున చైనాతో కలిసి ముందుకు వెళ్లడం భారత్ కు ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.
తాజాగా, చైనీయులకు టూరిస్ట్ వీసాల పునఃప్రారంభ ప్రక్రియను భారత్ చేపట్టడం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల చైనా పర్యటన కారణంగా ఇరు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ చైనాకు చెందిన పలు సంస్థలతో భాగస్వామ్యాలను మరింత వేగవంతం చేస్తోంది. అటు, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోతో జాయింట్ వెంచర్ కూడా ముందుకు సాగుతోంది. అటు, ఫాక్స్‌కాన్ సంస్థ చైనీస్ కార్మికులను వెనక్కి పిలిపించడం అంశం కూడా భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపదని చెబుతున్నారు. దీంతోపాటు, అరుదైన భూ అయస్కాంతాలకు సంబంధించిన దిగుమతి పరిమితులపై చైనా నుంచి సడలింపులు ఉంటాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ
మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి