Share News

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

ABN , Publish Date - Mar 08 , 2025 | 02:52 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు గుజరాత్ సఫల్, గుజరాత్ మిత్రా పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. అనేక పథకాల సొమ్మును నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే బదిలీ చేస్తున్నామన్నారు.

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

నవ్‌సరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. మహిళాభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, ఆడకూతుళ్ల ఆశీస్సులు తన లైఫ్ అకౌంట్‌లోకి వచ్చిచేరాయని, నిరంతరం వారి ఆశీస్సులు పెరుగూతునే ఉన్నాయని, ప్రపంచంలో తనకంటే ధనవంతుడు మరొకరు లేరని మోదీ అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా గుజరాత్‌ (Gujarat)లోని నవసరి జిల్లాలో జి-సఫల్, జి-మిత్రతో సహా పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. లఖ్‌పతి దీదీలతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పటేల్ పాల్గొన్నారు.

Women's Day:ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం.. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు...


modi1.jpg

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, మహిళా దినోత్సవం రోజు గుజరాత్ సఫల్, గుజరాత్ మిత్రా పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అనేక పథకాల సొమ్మును నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే బదిలీ చేస్తున్నామన్నారు. ''ఈరోజు నారీలోకానికి అంకితమైన రోజు. మహిళల నుంచి స్ఫూర్తి పొందాల్సిన రోజు. వారి నుంచి ఎంతోకొంత నేర్చుకోవాల్సిన రోజు. ఈరోజు నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడనని గర్వంగా చెప్పుకుంటున్నాను. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, ఆడకూతుళ్లు నిరంతరం ఆశీస్సులు అందజేస్తున్నారు. నాకంటే సంపన్నుడు ఈ ప్రపంచంలోనే లేరు'' అని మహిళల హర్షధ్వానాల మధ్య మోదీ చెప్పారు. ఐదుగురు లఖ్‌పత్ దీదీలను లఖ్‌పతి దీదీ సర్టిఫికెట్లను మోదీ ప్రదానం చేశారు.


జీ-సఫల్, జీ-మిత్రా

ప్రధానమంత్రి ఈ సందర్భంగా జి-సఫల్ (జీవనోపాధిని పెంచే అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జి-మిత్ర పథకాలను ప్రారంభించారు. జి-మిత్ర పథకం కింద గ్రామీణ జీవనోపాధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి పని చేస్తున్న స్టార్టప్‌లకు ఆర్థక సాయం అందిస్తారు. జీ-సఫల్ పథకం కింద అంత్యోదయ కుటుంబాలకు చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థిక సాయం, వ్యవస్థాపక శిక్షణ అందిస్తారు.


ఇవి కూడా చదవండి

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2025 | 03:04 PM