Mamata Banerjee: బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా.. నిరసన ర్యాలీలో సీఎం
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:38 PM
నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్‌లో ఉంటారని, ఇక్కడున్న బంగ్లాదేశ్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు.

కోల్‌కతా: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతాలో బుధవారంనాడు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అబిషేక్ బెనర్జీ సహా పలువురు సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సెంట్రల్ కోల్‌కతాలోని కాలేజీ స్క్వేర్ నుంచి ధర్మతాలలోని డోరిన క్రాసింగ్ వరకూ 3 కిలోమీటర్ల మేర నిరసన ప్రదర్శన జరిగింది. ఈ మార్గంలో 1,500 మంది భద్రతా సిబ్బంది మోహరించారు.
పశ్చిమ బెంగాల్ ఇండియాలో భాగం కాదా?
నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్‌లో ఉంటారని, ఇక్కడున్న బెంగాల్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బెంగాల్ కార్మికులు తమంత తాముగా వెళ్లలేదని, నిపుణ కార్మికులు కావడంతో అక్కడ ఉపాధి పొందుతున్నారని చెప్పారు. బెంగాలీలో ఎవరు మాట్లాడినా ఆరెస్టు చేసి, జైళ్లలో పెడుతున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని ఆమె నిలదీశారు. పశ్చిమబెంగాల్ ఇండియాలో భాగం కాదా అని ప్రశ్నించారు. బెంగాలీల పట్ల బీజేపీ వైఖరి చూసి సిగ్గుపడుతున్నానని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా టీఎంసీ ఆధ్యర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వంచారు. ప్రధాన నరేంద్ర మోదీ ఈనెల 18న బెంగాల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో దీనికి ముందు టీఎంసీ నిరసన ర్యాలీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
నాకు చెప్పకుండానే గోవా వదిలి వెళ్లింది... రష్యా మహిళ భర్త వెల్లడి
నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధంలో గెలువలేము
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి