Railway Ticket Transfer: మీ రైల్వే టికెట్ మీ ఫ్యామిలీకి ఇలా ట్రాన్స్ఫర్ ..స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:06 AM
మీరు బుక్ చేసుకున్న రైల్వే రిజర్వేషన్ టికెట్ ప్రయాణాన్ని, మీ కుటుంబ సభ్యులకు కూడా బదిలీ చేసుకోవచ్చని మీకు తెలుసా. తెలియదా, ఇది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రస్తుతం అనేక రకాల సేవలను అందిస్తోంది. వీటిలో మీరు బుక్ చేసుకున్న టికెట్‌ను మీ కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మీకు తెలుసా. తెలియదా అయితే దీని కోసం ఏం చేయాలి, ఎలా బదిలీ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అంటే మీరు బుక్ చేసుకున్న రిజర్వేషన్ టికెట్ ప్రయాణానికి ముందు ఏదైనా కారణం వల్ల ప్రయాణించలేకపోతే, ఆ టికెట్‌ను మీ కుటుంబ సభ్యులకు అంగీకరించబడిన ప్రక్రియలో బదిలీ చేసుకునే అవకాశం ఉంది. కానీ దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఇలా టికెట్ బదిలీ చేసే అవకాశం
మీరు రైలు టికెట్ బుక్ చేసుకున్న తరువాత వివిధ కారణాల వల్ల ప్రయాణించలేకపోతే, మీ టికెట్‌ను రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మీ కుటుంబ సభ్యులు ఆ ప్రయాణం చేయాలని భావిస్తే, వారికి ఆ టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కష్టపడి రిజర్వేషన్ చేసుకున్న టికెట్ డబ్బు వృథా కాకుండా ఉంటుంది. దీంతోపాటు రైల్వే సేవలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ సౌకర్యం కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ధృవీకరించబడిన టికెట్‌ను మీ తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త, భార్యకు మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ముందుగానే అభ్యర్థన చేయాలి
టికెట్ బదిలీ చేసుకునేందుకు ముందు మీరు రైల్వే స్టేషన్ వద్ద టికెట్‌ను బదిలీ చేయాలని అభ్యర్థించే సమయం.. రైలు బయలుదేరే 24 గంటల ముందు జరగాలి. ఈ ప్రక్రియను త్వరగా, సక్రమంగా పూర్తి చేయడానికి ఈ సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. మీ టికెట్ బదిలీ చేయాలంటే, ముందుగా అది ధృవీకరించబడిన రిజర్వేషన్ టికెట్ అయి ఉండాలి. మీ కుటుంబ సభ్యుల పేరుపై బదిలీ చేయాలంటే కొన్ని ప్రత్యేక రైల్వే రిజర్వేషన్ కేంద్రాలలో మాత్రమే అభ్యర్థన నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వైజాగ్, కాజీపేట్ సహా పలు ప్రాంతాల్లో మాత్రమే టికెట్ బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉంది. అన్ని రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం ఉండదు.
ఐడీ ప్రూఫ్స్ కూడా..
అభ్యర్థన సమర్పించే సమయంలో ప్రత్యేక పత్రాలు అవసరం. అంటే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు లేదా ఓటింగ్ ID వంటి ఆమోదయోగ్యమైన ID ప్రూఫ్ తీసుకుని రైలు స్టేషన్లో టికెట్ బదిలీ అభ్యర్థన కోసం వెళ్లాలి. ఆ క్రమంలో రైల్వే కేంద్రంలోని గెజిటెడ్ అధికారి సమక్షంలో అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఇవ్వాల్సి ఉటుంది. అప్పుడు గెజిటెడ్ అధికారి మీ వివరాలను తనిఖీ చేసి నిజమని నిర్ధారిస్తే ఆమోదిస్తారు. ప్రతి ప్రయాణికుడు తన టికెట్‌ను కేవలం ఒకసారి మాత్రమే బదిలీ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకసారి మీ టికెట్‌ను బదిలీ చేసిన తర్వాత, దానిని మళ్లీ మార్చడం లేదా తిరిగి బదిలీ చేయడం కుదరదు. ఈ విధానం ద్వారా మరికొంత ప్రయాణీకులు ఈ రైల్వే సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Accident: ఎస్‌యూవీ ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి, 14 మందికి గాయాలు
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News