Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:43 PM
పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, భద్రతపై సమీక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖ (MHA) కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. దీనికి హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సహస్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ), ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Pahalgam Attack: పహల్గాం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం
పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ నడుస్తున్నందున ఈ సమయంలో సున్నితమైన అంశాలను వెల్లడించలేమని అంటున్నారు.
మరోవైపు, జమ్మూకశ్మీర్ పోలీసులు దోడా జిల్లాలోని 13 ప్రాంతాల్లో దాడులు జరిపారు. టెర్రరిస్టు శిబిరాలను కనిపెట్టడం, ఉగ్రవాద కార్యకర్తలతో సంబంధం వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. శ్రీనగర్ పోలీసులు సైతం సిటీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నివాసాలపై, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కేసులు నమోదైన టెర్రరిస్టు సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. 63 మంది అనుమానిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు జరిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..