Share News

Rains: 11 జిల్లాలకు భారీ వర్షసూచన

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:46 AM

నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో ఈ నెల 13,14,15 తేదీల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ‘ఆరెంజ్‌’ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపూర్‌ సహా 11 జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.

Rains: 11 జిల్లాలకు భారీ వర్షసూచన

- కోవై, నీలగిరి జిల్లాలకు మూడు రోజుల ‘ఆరెంజ్‌’ అలర్ట్‌

చెన్నై: నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో ఈ నెల 13,14,15 తేదీల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ‘ఆరెంజ్‌’ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపూర్‌(Krishnagiri, Dharmapuri, Tirupur) సహా 11 జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.


nani4.2.jpg

ఈ విషయమై ఆ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... మంగళవారం రాణిపేట, వేలూరు(Ranipet, Veluru), తిరువణ్ణామలై, తిరుపత్తూర్‌, కృష్ణగిరి, ధర్మపురి, ఈరోడ్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. 13,14,15 తేదీల్లో నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లో అతి భారీవర్షం, దిండుగల్‌, తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి(Kanniyakumari), తిరునల్వేలి కొండ ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 10 , 2025 | 11:46 AM