Rajya Sabha: రాజ్యసభకు హర్షవర్ధన్, ఉజ్వల్ నికం.. నామినేట్ చేసిన రాష్ట్రపతి
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:25 PM
నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.

న్యూఢిల్లీ: రాజ్యసభ (Rajya Sabha)కు నలుగురు సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నామినేట్ చేశారు. వీరిలో ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావు నికం, మాజీ దౌత్యవేత్య హర్ష వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్ ఉన్నారు.
నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసే ప్రత్యేక అధికారం రాష్ట్రపతికి ఉంది.
1.హర్షవర్దన్ శ్రింగ్లా: మాజీ విదేశాంగ కార్యదర్శి. అమెరికా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌కు అంబాసిడర్‌గా పనిచేశారు. ఇండియా జి-20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
2.మీనాక్షి జైన్: ప్రముఖ చరిత్రకారిణి, విద్యావేత్త. భారతదేశ నాకరికత, మత వారసత్వాన్ని చాటిచెప్పేందుకు విశేష కృషి చేశారు. విద్యారంగంలో కృషికి 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా పనిచేశారు.
3.ఉజ్వల్ దేవరావు నికమ్: 26/11 ముంబై ఉగ్రదాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్. బీజేపీ నేత కూడా.
4.సి సదానందన్ మాస్టర్: కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త. త్రిసూర్‌లో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తించారు. దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలందించారు.
ఇవి కూడా చదవండి..
అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు
భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి