ISRO Chairman: డిసెంబరులో గగన్‌యాన్
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:43 AM
మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వచ్చే డిసెంబరులో మానవరహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు.

మానవరహిత రాకెట్ ప్రయోగం : ఇస్రో చైర్మన్ నారాయణన్
చెన్నై, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వచ్చే డిసెంబరులో మానవరహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు. తమిళనాడులోని కన్నియాకుమారి జిల్లా కులశేఖర పట్టణంలో యువ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గగన్‌యాన్’ మిషన్ ద్వారా ఒక భారతీయుడిని ఏవోజీ పద్ధతి ప్రకారం రాకెట్‌లో అంతరిక్షానికి పంపి.. అక్కడ పరిశోధనల అనంతరం మళ్లీ భూమి మీదకు తీసుకురానున్నామని చెప్పారు. వచ్చే డిసెంబరులో మానవ రహిత రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపుతామని, ఆ తర్వాత మరో రెండు రాకెట్లను పంపి పరిశోధనలు పూర్తి చేశాక.. 2027లో అంతరిక్షంలోకి మనిషిని పంపే గగన్‌యాన్ మిషన్‌ను చేపడతామని నారాయణన్ తెలిపారు. 2040లో చంద్రుడిపై భారతీయులు అడుగుపెట్టేలా మిషన్‌ను రూపొందించే ప్రయత్నాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.