Share News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం

ABN , Publish Date - Jul 26 , 2025 | 09:05 PM

మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు. వీటిలో INSAS, SLR రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం
Chhattisgarh Encounter

రాయ్ పూర్: మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం నాడు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురెదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


కాగా, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు. వీటిలో INSAS, SLR రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని, చెదురుమదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.


అటు జార్ఖండ్‌లోనూ..

మరోవైపు, జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా ఘాగ్రా అడవుల్లోనూ భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం నాడు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్‌కు చెందిన ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.


ఇవి కూడా చదవండి..

ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు బీభత్సం.. 20 వాహనాలు ధ్వంసం, ఒకరి మృతి

భారత సైన్యంలోకి ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్... రుద్ర

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 26 , 2025 | 09:32 PM