Five-step security: సమీపిస్తున్న రిపబ్లిక్ డే.. అడుగడుగునా తనిఖీలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:41 AM
భారతదేశ 76వ రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఐదంచెల భద్రత సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.

- విమానాశ్రయానికి ఐదంచెల భద్రత
చెన్నై: భారతదేశ 76వ రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఐదంచెల భద్రత సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఈ నెల 30వ తేదీ వరకు ఈ విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్(CISF), రిజర్వు పోలీసు, కమాండో, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు వాహనాల తనిఖీ చేస్తారు.
ఈ వార్తను కూడా చదవండి: Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది నక్సలైట్లు మృతి
24, 25, 26 తేదీల్లో గరిష్ఠస్థాయిలో ఏడంచెల భద్రతా విధానాన్ని అమలుపరచనున్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు వచ్చే వాహనాలను ప్రధాన ప్రవేశ ద్వారం వద్దే నిలిపి డాగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తున్నారు. వీరికి బాంబు స్క్వాడ్, పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఈ బృందాలు విమానాశ్రయ ప్రాంగణం, కారు పార్కింగ్ ప్రాం తాల్లో మెటల్‌డిటెక్టర్ల సహాయంతో తనిఖీలు చేస్తున్నారు.
కాగా, ఎయిర్‌పోర్టు అథారిటీ గుర్తింపు కార్డులున్న ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా నిబంధనలను కఠినతరం చేయడంతో విమానాలకు ఇంధ నం నింపే ప్రాంతాల్లో ఆర్మ్‌డ్ ఫోర్స్‌తో నిఘా వేశారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల(CCTV cameras)తో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో భద్రత కంట్రోల్ రూమ్ నుండి 24 గంటలు షిఫ్ట్ విధానంలో పర్యవేక్షస్తున్నారు. ప్రయాణికుల బ్యాగేజీ, పార్సెల్స్‌ను స్కానర్ల ద్వారా తనిఖీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే 30వ తేదీ వరకు అదనంగా తనిఖీలు నిర్వహిస్తున్నందువల్ల డొమెస్టిక్ ప్రయాణికులు గంటన్నర ముందు, విదేశాలకు వెళ్లేవారు మూడు గంటల ముందుగా విమానాశ్రయాలకు చేరుకోవల్సిందిగా అధికారులు సూచించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ విమానాశ్రయాలు పోలీసుల భద్రతా వలయంలోకి రావడం గమనార్హం. అదే విధంగా రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఆలయాలు, మసీదులు, చర్చీలు, ప్రముఖ పర్యాటక పర్యాటక కేంద్రాల్లో పోలీసు బృందాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు.
ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్?
ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా
ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు
Read Latest Telangana News and National News