Share News

Ooty: ఊటీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:17 PM

నీలగిరి జిల్లా ఊటీలో షూటింగ్‌లకు అనుమతిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఊటీని ఏడాదికి సుమారు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా, వేసవి సీజన్‌లో మాత్రమే పర్యాటకుల సంఖ్య 8 లక్షలుంటుంది.

Ooty: ఊటీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీలో షూటింగ్‌లకు అనుమతిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఊటీని ఏడాదికి సుమారు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా, వేసవి సీజన్‌లో మాత్రమే పర్యాటకుల సంఖ్య 8 లక్షలుంటుంది.

nani5.jpg


nani5.3.jpg

వేసవి సీజన్‌ పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా ఊటీ బొటానికల్‌ గార్డన్‌, రోజా పార్క్‌, కున్నూర్‌ సిమ్స్‌ పార్క్‌ తదితర పర్యాటక ప్రాంతాలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలలు సినిమా షూటింగ్‌లకు నిషేధం విధించారు.


ప్రస్తుతం సీజన్‌ ముగియడంతో సినిమా షూటింగ్‌లకు అనుమతించినట్లు, ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి తగిన రుసుము చెల్లించి షూటింగ్‌లకు అనుమతి పొందవచ్చని అధికారులు తెలిపారు.

nani5.4.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 12:17 PM