Share News

Fake Video: మస్క్‌ కాళ్లు నాకుతున్న ట్రంప్‌.. ఏఐ వీడియో వైరల్‌

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:16 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. స్పేస్‌ఎక్స్‌ అధినేత మస్క్‌ పాదాలను నాకుతున్నట్టుగా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఫేక్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది!

Fake Video: మస్క్‌ కాళ్లు నాకుతున్న ట్రంప్‌.. ఏఐ వీడియో వైరల్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 26: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. స్పేస్‌ఎక్స్‌ అధినేత మస్క్‌ పాదాలను నాకుతున్నట్టుగా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఫేక్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది! దీన్ని తయారుచేసిన వ్యక్తి ఎవరో తెలియదుగానీ.. రెండు రోజుల క్రితమే అమెరికా హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (హెచ్‌యూడీ) కార్యాలయంలోని అన్ని టీవీల్లో ఈ వీడియో తొలుత ప్రసారమైంది. ఎవరో ఆ టీవీల్ని హ్యాక్‌ చేసి.. ఆపకుండా లూప్‌లో ఆ వీడియోను ప్రసారం చేశారు. ‘‘లాంగ్‌ లివ్‌ ద రియల్‌ కింగ్‌’’ అనే నినాదంతో ఆ వీడియో పదే పదే ప్రసారం అవుతుండడంతో కార్యాలయ సిబ్బంది లోపలున్న టీవీలన్నింటినీ కట్టేశారు. కానీ, అది అక్కడితో ఆగక నెట్‌లో కూడా వైరల్‌ అయ్యింది.

Updated Date - Feb 27 , 2025 | 06:16 AM