EPS: స్టాలిన్‌కు ఈపీఎస్ కౌంటర్.. ముందు మీ అవినీతి గురించి చెప్పండి
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:00 AM
రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.

చెన్నై: రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు. ఆ విషయాన్ని వదిలేసి కల్లబొల్లి మాటలు చెబితే లాభం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎద్దేవా చేశారు. గురువారం సేలం ముత్తుమలై కొండ శిఖరంపై ఉన్న సుబ్రమణ్యస్వామిని ఈపీఎస్(EPS) దర్శించు కున్నారు.
ఈ సందర్భంగా పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రసాదాలందించారు. స్వామివారిని దర్శించిన అనంతరం అన్నాడీఎంకే జిల్లా స్థాయి ప్రచారం విజయవంతం కావాలని, రాష్ట్రంలో మళ్ళీ అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటూ వెండి ఖడ్గాన్ని ఈపీఎస్ బహూకరించారు. ఈ ఆలయం ప్రాంగణం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల పదవులను డీఎంకే కుటుంబ సభ్యులకే కట్టబెట్టారని ఈపీఎస్ ఆరోపించారు.
మదురై కార్పొరేషన్‌లో జరిగిన రూ.200 కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మదురై కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలో మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కూడా అవినీతి జరగడం వల్లే కోవై, తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్లు రాజీనామా చేసిన వాస్తవాన్ని ప్రజలకు తన పర్యటనలో వివరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈపీఎస్‌తో వెంట మాజీమంత్రి డాక్టర్ సి.విజయభాస్కర్, వీరపాండి ఎమ్మెల్యే, ముత్తురాజా తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News