Jammu and Kashmir: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల ఉచ్చులో టీఆర్ఎఫ్ కీలక కమాండర్?
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:12 PM
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదలికలకు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తుంగ్‌మార్క్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

కుల్గామ్: పహల్గాంలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలోని జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదలికలకు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తుంగ్‌మార్క్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు నుంచి ముగ్గురు భద్రతా బలగాల వలయంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టిఆర్ఎఫ్) కీలక కమాండర్ కూడా ఒకరు ఉన్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇతనే
దీనికి ముందు, బుధవారం ఉదయం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులను బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలిగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పాక్ కరెన్సీని బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పహల్గాం ఘటన తమ పనేనంటూ ఇప్పటికే టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది.
ఇవి కూడా చదవండి..