Elon Musk: తల్లి బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..
ABN , Publish Date - Apr 21 , 2025 | 08:25 AM
బిలియనీర్ ఎలాన్ మస్క్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కానీ ఈసారి హాట్ టాపిక్ కాదు, మాతృభక్తితో మనసుల్ని గెలుచుకుంటున్నారు. అసలు ఏమైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్‌గా నిలిచే టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తాజాగా తన తల్లి మే మస్క్‌కు 77వ జన్మదినం సందర్భంగా ముంబైలో అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని, ముంబైలోని తన తల్లికి అందమైన పెద్ద పూల బొకేను పంపించారు. దీంతో మస్క్ తల్లి సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
సోషల్ మీడియాలో ఆనందం
అంతేకాదు మే మస్క్ ఎలాన్ మస్క్‌కు థాంక్యూ అని కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ Xలో పూలతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ముంబైలో నాకు ఈ అందమైన పూలను పంపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
తల్లి తర్వాతే..
ఈ క్రమంలో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ “లవ్ యూ, మామ్. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్” అని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మస్క్ కుటుంబంలో ప్రతి ఐదు సంవత్సరాలకు మే జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. ఆమె పిల్లలు ఎలాన్, కిమ్‌బాల్, టోస్కా మస్క్ కలరు. ఈ ట్వీట్ ఇప్పటికే 15 లక్షల మందికిపైగా వీక్షించారు. అంతేకాదు ఈ ట్వీట్ చేసిన పలువురు ఢిల్లీకి రాజు అయినా కూడా తల్లికి మాత్రం కుమారుడేనని కామెంట్లు చేస్తున్నారు. బిలీయనీర్ అయిన మస్క్ తల్లి పుట్టినరోజును గుర్తు పెట్టుకుని సర్ ప్రైజ్ చేయడం గ్రేట్ అని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్‌పై ప్రేమ
మే మస్క్ భారత్‌లో గడుపుతున్న సమయం కేవలం జన్మదిన వేడుకలకే పరిమితం కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎలాన్ మస్క్‌తో జరిపిన సంభాషణ గురించి పోస్ట్ చేయగా, మే దాన్ని రీట్వీట్ చేశారు. అందులో “ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లలో సహకార అవకాశాల గురించి చర్చించాము. ఈ రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉంది''. మే ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ, హార్ట్, స్మైలీ, భారత జాతీయ జెండా ఎమోజీలను యాడ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మే మస్క్ ఇండియాపై తన ప్రేమను చాటుకున్నారని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Gold Rates Today: ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..ఈ వారం లక్షకు చేరుతుందా..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News