Elon Musk: ఈ ఏడాది చివర్లో భారత్‌లో మస్క్ పర్యటన
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:50 AM
ఈ ఏడాది చివరిలో తాను భారత్‌లో పర్యటించనున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ శనివారం వెల్లడించారు. ప్రధాని మోదీతో శుక్రవారం ఫోన్‌లో సంభాషించిన తర్వాత మస్క్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఈ ఏడాది చివరిలో తాను భారత్‌లో పర్యటించనున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ శనివారం వెల్లడించారు. ప్రధాని మోదీతో శుక్రవారం ఫోన్‌లో సంభాషించిన తర్వాత మస్క్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. మస్క్ సంస్థ టెస్లా భారత్‌లో విద్యుత్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న వేళ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీతో సంభాషించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు మస్క్‌శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(డోజ్)లో ఆయన కీలక పాత్ర వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా సుదీర్ఘ కాలంగా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఎదురుచూస్తోన్న మస్క్ సంస్థ టెస్లా అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ముంబయికి దగ్గరలోని ఒక ఓడరేవుకు టెస్లా కొన్ని వేల విద్యుత్ వాహనాలను మరి కొద్ది నెలల్లో రవాణా చేయనుందని బ్లూమ్‌బర్గ్ ఒక కథనంలో పేర్కొంది. టెస్లా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి ముఖ్య నగరాల్లో విక్రయాలు కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారి్‌ఫల మోత, ఎగుమతులు, దిగుమతుల్లో కల్లోలం నేపథ్యంలో.. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో సుంకాలు, ఇతర సమస్యలు, కస్టమ్స్ ఏర్పాట్లు సహా 19 అంశాలపై ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చించనున్నారు. ఈ చర్చల్లో భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తారు.
ఇవి కూడా చదవండి..