Share News

Rift in Mahayuti: మహారాష్ట్ర సీఎం కార్యక్రమాల్లో కానరాని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:25 PM

మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో అసంతృప్తి మొదలైందా అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. సీఎం హాజరైన పలు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే దూరంగా ఉండిపోవడం ఆసక్తికర పరిణామమని వ్యాఖ్యానిస్తున్నారు.

Rift in Mahayuti: మహారాష్ట్ర సీఎం కార్యక్రమాల్లో కానరాని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న మహాయుతి కూటమి సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయా? తాజా పరిణామాల నేపథ్యంలో విశ్లేషకుల నోట ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరైన పలు అధికారిక కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే దూరంగా ఉండటం ‘మహా’ రాజకీయాల్లో ఆసక్తికంగా మారింది (Maharashtra).

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఇటీవల థానే జిల్లాలో బద్లాపూర్‌లో ఆగ్రా కోట వేదికగా ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం హాజరవగా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే దూరంగా ఉన్నారు. అంతేకాకుండా అంబేడ్గావ్ బద్రుక్‌లో శివశ్రుతి థీమ్ పసార్క్ రెండో దశ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం హాజరైనా డిప్యూటీ సీఎం మాత్రం కానరాలేదు.


New Delhi zoya Khan: ఏళ్ల తరబడి తప్పించుకుని తిరిగిన ఢీల్లీ లేడీ డాన్ ఎట్టకేలకు అరెస్టు

మహాయుతి గెలుపు తరువాత ముఖ్యమంత్రి పోస్టు ఏక్‌నాథ్ శిండేకు రాకపోవడంతో ఆ వర్గంలో అసంతృప్తి అప్పుడే బయటపడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తరువాత కొందరు ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీ తొలగింపు చర్యల ఈ విభేదాలను మరింత పెంచిందని చెబుతున్నారు. శిండే వర్గం తిరుగుబాటు నేపథ్యంలో అప్పట్లో 44 ఎమ్మెల్యేలకు, 11 మంది ఎంపీలకు ఈ భద్రతను ఇచచారు. తాజాగా వాటిని తొలగించారు. వై సెక్యూరిటీ కోల్పోయిన వారిలో అన్ని పార్టీల నేతలు ఉన్నా శిండే వర్గం వారే అత్యధిక మంది ఉన్నారు. శిండే సన్నిహితులకు కూడా వై సెక్యూరిటీ తొలగించారట. అయితే, వీరెవరికీ క్యాబినెట్‌లో చోటులేకపోవడం గమనార్హం.


USAID Funds: భారత ఎన్నికల్లో అమెరికా జోక్యంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రగడ

ఇక శివ సేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ మధ్య కూడా అంత సఖ్యత లేదన్న వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. మహాయుతి విజయంలో కీలక పాత్ర పోషించిన లాడ్కీ బహెన్ యోజనకు సంబంధించి ఎన్సీపీ ప్రచార కార్యక్రమాల్లో పథకం పేరు మందు ముఖ్యమంత్రి అన్న పదం లేకపోవడంపై శిండే వర్గం అభ్యంతరం వ్యక్తం చేసిందట. అయితే, ఎన్సీపీ వర్గాలు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదని అంటున్నాయి.

ఇక నాశిక్, రాయ్‌గఢ్ గార్డియన్ మినిస్టర్లుగా ఎన్సీపీ నేత అదితీ టట్కరే, బీజేపీ నేత గిరీశ్ మహాజన్ నియామకంపై కూడా శిండే అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో 2027 జరగనున్న నాశిక్ కుంభమేళా ఏర్పాట్లపై ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా ఏక్‌నాథ్ శిండే కానరాలేదు. ఈ అనుమానాలను బీజేపీ సీనియర్ నేత ఆశిష్ షేలార్ కొట్టిపారేశారు. కూటమి సభ్యుల్లో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 01:29 PM