DMK: ఫ్యామిలీని కాపాడుకునేందుకే బీజేపీతో ఎడప్పాడి పొత్తు.. డీఎంకే స్పందన
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:46 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు కుదరడంపై డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళాంగోవన్ సూటిగా స్పందించారు.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అన్నాడీఎంకే-బీజేపీ (AIADMK-BJP) మధ్య పొత్తు కుదరడంపై డీఎంకే (DMK) తొలిసారి స్పందించింది. బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు ముందుగా ఊహించినదేనని డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ (TKS Elangovan) అన్నారు. ఎడప్పాడి పళనిస్వామి తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకే బీజేపీ ఒత్తిడికి లొంగిపోయారని ఆరోపించారు.
Tamilnadu Asssmbly Election 2026: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్
"ఇది (పొత్తులు) ముందుగానే ఊహించాం. వాళ్లు బీజేపీని చూసి భయపడిపోయారు. ఎడప్పాడి కుమారుడు, ఆయన బంధువులపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. వారిని తాను కాపాడలేనని ఎడప్పాడి ఆలోచించారు. దాంతో బీజేపీ కాళ్లపై పడ్డారు'' అని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇళంగోవన్ చెప్పారు. 2021లో బీజేపీ-అన్నాడీఎంకే కలిసే పోటీ చేశాయనీ, కానీ డీఎంకే గెలిచి అధికారం చేపట్టిందని అన్నారు.
విజయ్ వాళ్ల ఓట్లే చీల్చుకుంటారు
తమిళగ వెట్రి కళగం నేత విజయ్ పోటీని ప్రస్తావిస్తూ, విజయ్ సెపరేట్‌గా పోటీ చేస్తున్నారనీ, ఆయన సొంతంగా పోటీ చేస్తే బీజేపీ-అన్నాడీఎంకే ఓట్లే చీలుతాయని, డీఎంకే ఓట్లు ఏకమొత్తంగా డీఎంకేకే పడతాయని అన్నారు. విపక్షాల ఓట్లే చీలడం వల్ల డీఎంకేకు మరింత మేలు చేకూరుతుందని ఇళంగోవన్ విశ్లేషించారు.
కాగా, దీనికి ముందు అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెన్నైలో ప్రకటించారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి మందస్తు షరతులు కానీ డిమాండ్లు కానీ లేవన్నారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తమ జోక్యం ఉండదని, పొత్తుతో ఉభయపక్షాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తమ కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..