Share News

Dy CM: అసలు విషయం చెప్పేసిన డిప్యూటీ సీఎం.. నా తుదిశ్వాస వరకు..

ABN , Publish Date - Feb 27 , 2025 | 01:09 PM

‘నేను పుట్టుకతో హిందువును, కాంగ్రెస్‌ వాదిని, నా వ్యక్తిగతమైన నమ్మకాన్ని పాటిస్తానని కానీ బీజేపీతో సన్నిహితం అవుతున్నా’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) మండిపడ్డారు. సదాశివనగర్‌లోని నివాసం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Dy CM: అసలు విషయం చెప్పేసిన డిప్యూటీ సీఎం.. నా తుదిశ్వాస వరకు..

- తుదిశ్వాస వరకు హిందువునే.. కాంగ్రెస్‌ను వీడను.. బీజేపీకి మద్దతు వదంతులే..

- కుంభమేళా ఏర్పాట్లను ప్రశంసిస్తే తప్పేముంది: డీసీఎం డీకే

బెంగళూరు: ‘నేను పుట్టుకతో హిందువును, కాంగ్రెస్‌ వాదిని, నా వ్యక్తిగతమైన నమ్మకాన్ని పాటిస్తానని కానీ బీజేపీతో సన్నిహితం అవుతున్నా’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) మండిపడ్డారు. సదాశివనగర్‌లోని నివాసం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీ వేణుగోపాల్‌ తననే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగాలని సూచించారనే ప్రచారం అవాస్తవమన్నారు. ఇంకా ఎన్నో తప్పుడు ప్రచారం జరుగుతున్నాయన్నారు. ఇషా ఫౌండేషన్‌కు తన కుమార్తె వెళ్లేవారన్నారు. ఈ ఏడాది ఇషా ఫౌండేషన్‌ ముఖ్యులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Police station: పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం.. ఇన్‌స్పెక్టర్‌ సహా ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష


ఆయన మైసూరుకు చెందినవారని, ఆయన జ్ఞానం ప్రశంసనీయమన్నారు. అంతమాత్రాన బీజేపీతో వెళ్తాననేది తప్పుడు ప్రచారం అన్నారు. తాను హిందువునని అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. కాంగ్రెస్‌ అందరినీ సమైక్యంగా భావిస్తుందన్నారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ సమైక్యవిధానం పాటించారన్నారు. సోనియాగాంధీ ఉగాది పండుగ చేయడం చూశానన్నారు. ఆమె మనకంటే ఎక్కువ భారతీయతను పాటిస్తారన్నారు. అటువంటి వారి నాయకత్వంలో ఉన్నానన్నారు. తమ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అంటే శివుడి పేరు అన్నారు. ఆయన పేరు మార్చుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. హిందువుగా పుట్టానని, హిందువుగానే తుదిశ్వాస వీడుతానన్నారు.


మహాకుంభమేళాలో పాల్గొనడం, ఇషా ఫౌండేషన్‌లో శివరాత్రి వేడుకలకు వెళ్లడం వల్ల ఇలాంటి ప్రచారం సాగుతోందన్నారు. జైన, సిక్కు మఠాలకు వెళ్లానని, దర్గా, చర్చ్‌లకు వెళ్లానన్నారు. మహాకుంభమేళాలో నా అనుభవం బాగుందని, అక్కడి ఏర్పాట్లను స్వాగతిస్తానన్నారు. ఇదో సాధారణ విషయం కాదని, అంత భారీస్థాయిలో ప్రజలను పర్యవేక్షించడం అనేది సామాన్యమైనది కాదన్నారు. ఒకటిరెండు తప్పులను ప్రస్తావించేది లేదన్నారు.


pandu1.2.jpg

మతంలో భక్తుడు, భగవంతుడిమధ్య, సంబంధం ఉంటుందని, కొందరు దేవుడితో నేరుగా వ్యవహరిస్తే మరికొందరు అర్చకుల ద్వారా పూజలు జరుపుతారన్నారు. శశిథరూర్‌ బీజేపీవైపు మొగ్గు చూపుతున్న తరుణంలోనే మీ అడుగులు అటువైపా అనే ప్రశ్నకు స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేష్టమైనదని, ఓ గొప్ప చరిత్ర ఉందన్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై స్పందిస్తూ గతంలో స్టీల్‌ బ్రిడ్జ్‌ను వ్యతిరేకించినట్లే సొరంగ మార్గాన్ని విమర్శిస్తున్నారన్నారు.


కేంద్రమంత్రి కుమారస్వామిది కేవలం రాజకీయమని, కెంపేగౌడ పేరు నాశనం చేసేందుకు వెళ్లారన్నారు. ఆయన సీఎంగా ఏం చేశారనేది తెలుసుకోవాలన్నారు. పారిశ్రామికవేత్త మోహన్‌దాస్‏పై రాజకీయాల్లో ప్రవేశించాలన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం తనకు దేవాలయం అన్నారు. సమష్టి నాయకత్వంలోనే ముందుకు వెళ్తామన్నారు. బోర్డులు, కార్పొరేషన్లలో బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మీడియాముందు మంత్రి రాజణ్ణ వ్యాఖ్యలకు సమాధానం చెప్పేది లేదంటూ దాటవేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?

ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2025 | 01:09 PM