Bengaluru: పెళ్లికి ముందు.. హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:24 PM
పెళ్ళికి ముందే హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్‌రాజ్ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది.

- ప్రముఖ వైద్యుడు భరత్‌రాజ్ పి.యాళగి
బెంగళూరు: పెళ్ళికి ముందే హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్‌రాజ్ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది. మేఘాలయ ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
కర్ణాటకలో అమలులోకి తీసుకువస్తే దేశంలోనే తొలి సాధన కానుందన్నారు. 1996-97లో పెళ్ళికి ముందే హెచ్‌ఐవీ పరీక్షలు జరిపేందుకు తగిన బిల్లును ప్రైవేటు రూపంలో తీసుకువచ్చేందుకు అప్పటి విధానపరిషత్ సభ్యులు హెచ్‌కె పాటిల్ తీసుకురావాల్సి ఉండేదన్నారు. 2005లో ధరంసింగ్ ప్రభుత్వంలో హెచ్‌కే పాటిల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తావించానన్నారు. కొన్ని కీలక అంశాలతో చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. కానీ రాజకీయ కారణాలతో సాధ్యం కాలేదన్నారు. విద్యాపరంగా అభ్యుదయ అభిప్రాయాల దృష్టితో రాష్ట్రంలో ఇప్పుడైనా బిల్లును తీసుకురావాలని కోరారు.
ఇటీవలే శాసనసభా వ్యవహారాలు, న్యాయశాఖా మంత్రి హెచ్‌కె పాటిల్‌తె ఇటీవలే చర్చలు జరిపినట్లు తెలిపారు. మరో పదిరోజులలో జరిగే శాసనసభ సమావేశాలు లేదా చలికాలం వేళ అయినా బిల్లును తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. మూడు దశాబ్దాలతో పోల్చినా హెచ్‌ఐవీ సమాజంలో పూర్తిగా తొలగలేదన్నారు. పైగా వ్యాధిని పూర్తిగా నియంత్రించే మందులు రాలేదన్నారు. పెళ్ళికి ముందు హెచ్‌ఐవీ పరీక్షలు జరిపించడం అనే ప్రక్రియలో ఎటువంటి తప్పు లేదన్నారు. ముందుగా జబ్బును తెలుసుకోవడం ద్వారా భాగస్వామికి ప్రత్యేకంగా పుట్టబోయే చిన్నారులకు జబ్బు నుంచి రక్షించినట్లు అవుతుందన్నారు.
1992 నుంచి వివిధ జబ్బులతో వచ్చే రోగులకు వారి బంధువులకు హెచ్‌ఐవీ గురించి చైతన్యం తీసుకువచ్చానన్నారు. అప్పట్లో తన ఆలోచనలను అపహాస్యం చేశారన్నారు. దేశంలో ఎయిడ్స్ ప్రభావం ఎంతస్థాయికి తీసుకెళ్ళిందనేది అందరికీ తెలిసిందే అన్నారు. ఓ డాక్టర్‌గా కనీసం 500 పెళ్ళిళ్ళను నిలిపివేశానన్నారు. పెళ్ళి పత్రికలతో వచ్చే వారికి పలు విధాలుగా చైతన్యం కలిగించి పరీక్షలు జరిపించి రద్దు చేయించానన్నారు. కనీసం పదివేల మందికి వ్యాధి పట్ల చైతన్యం కలిగించామన్నారు. పెళ్ళికి మూడు నెలల ముందే పరీక్షలు జరిపించుకోవాలని సూచిస్తానన్నారు.
తద్వారా నిశ్చితార్థం వంటి ప్రక్రియలు జరుగవన్నారు. వ్యాధి ఉన్నట్లు తేలితే పెళ్ళికి దూరంగా ఉండటం ద్వారా ఒకరిని వ్యాధి నుంచి జీవిత కాలం కాపాడినట్లే అన్నారు. ప్రస్తుతం మేఘాలయ, గోవా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలలోను ఇటువంటి చట్టంతీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పెళ్ళికి ముందు ఒక్కరే కాదని వధూవరులు ఇద్దరూ పరీక్షలు జరిపించుకోవాలన్నారు, పెళ్ళికి ముందు చదువు, ఉద్యోగం, ఆస్థుల వంటి విషయాలకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో అంతకంటే ఆరోగ్యానికి కూడా ఉండాలనేది తన ఆశయమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..
Read Latest Telangana News and National News