MLA: అసెంబ్లీలో నవ్వులు పూయించిన ఎమ్మెల్యే.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:48 PM
తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నవ్వులు పూయించారు. ఉదయనిధి మంత్రివర్గంలోనూ దురైమురుగన్‌కు చోటు ఉంటుందంటూ ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలతో సభలో అందరూ నవ్వుకోవడం జరిగింది.

- ఉదయనిధి మంత్రివర్గంలోనూ దురైమురుగన్‌కు చోటు
- అసెంబ్లీలో నవ్వులు పూయించిన డీఎంకే ఎమ్మెల్యే
చెన్నై: రాబోయే రోజుల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) నేతృత్వంలో ఏర్పాటు కానున్న మంత్రివర్గంలో సీనియర్ మంత్రి దురైమురుగన్(Duraimurugan)కు స్థానం వుంటుందని శీర్గాలి డీఎంకే ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం ప్రస్థావించి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. గురువారం ఉదయం అసెంబ్లీలో రోడ్ల విస్తరణ అంశంపై మాట్లాడిన ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం తంజావూరు జిల్లా కొల్లిడం నదీకుడివైపున గట్టు బలపరుస్తారా? అని ప్రశ్నించగా, ఆ శాఖ మంత్రి దురైమురుగన్ చెప్పిన సమాధానాన్ని ఎమ్మెల్యే స్వాగతించారు.
ఈ వార్తను కూడా చదవండి: Flight: జూన్ నుంచి తిరుచ్చి - హైదరాబాద్ విమాన సేవలు
కలైంజర్ కరుణానిధి మంత్రివర్గంలో ఆయన కుమారుడు స్టాలిన్ మంత్రివర్గంలో ప్రజలు మెచ్చుకునే విధంగా పనిచేసిన సీనియర్ మంత్రి దురైమురుగన్ ఉదయనిధి మంత్రివర్గంలో కూడా వుంటారని చమత్కరించడంతో సభ్యులందరు నవ్వుతూ కరతాళధ్వనులతో హర్షంవ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News