Share News

MLA: మహిళలను కించపరచడం ఆ పార్టీ నేతలకు అలవాటే..

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:45 PM

మహిళలను కించపరచడం డీఎంకే పార్టీ నేతలకు అలవాటేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్ముడి మాత్రమే కాదు, డీఎంకే నేతల్లో పలువురు మహిళలకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం అలవాటేనన్నారు.

MLA: మహిళలను కించపరచడం ఆ పార్టీ నేతలకు అలవాటే..

- అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు

చెన్నై: మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం డీఎంకే(DMK) నేతలకు అలవాటేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు(Sellur Raja) పేర్కొన్నారు. మదురై పశ్చిమ శాసనసభ నియోజకవర్గంలోని ఏర్కుడి అచ్చపత్తులో అమ్మాపార్కు నిర్మాణానికి శుక్రవారం ఉదయం జరిగిన భూమిపూజలో సెల్లూరు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్ముడిని డీఎంకే ఉపప్రధాన కార్యదర్శి పదవినుండి తొలగించిన అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, మంత్రి పొన్ముడి మాత్రమే కాదు, డీఎంకే నేతల్లో పలువురు మహిళలకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం అలవాటేనన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Dr Ramdas: నో డౌట్.. ఆ పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుడిని..


ఈ సంస్కృతి దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి హయాం నుంచే టీవీ సీరియల్‌లా కొనసాగుతోందని విమర్శించారు. పొన్ముడికి వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు, ఫిర్యాదులు గతంలో కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) దృష్టికి వెళ్ళినా పట్టించుకోలేదని, అయితే డీఎంకే ఎంపీ కనిమొళి పొన్ముడిని తీవ్రంగా విమర్శించినందువల్లే ఆయన్ను పార్టీ నుండి తప్పించారన్నారు.


రాష్ట్రంలో ఎటుచూసినా అన్యాయం, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులు, మాధకద్రవ్యాల వినియోగం బాగా పెరిగిందని అందువల్ల డీఎంకే ప్రభుత్వంపై రాష్ట్రప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. 2026 ఎన్నికల్లో మళ్ళీ అన్నాడీఎంకే ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సెల్లూరు రాజు జ్యోష్యంచెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!

రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2025 | 12:45 PM