Chennai: పార్టీ పదవి నుంచి తమిళ మంత్రి పొన్ముడి ఔట్
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:21 AM
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పార్టీ పదవి నుంచి తప్పించారు.

చెన్నై, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పార్టీ పదవి నుంచి తప్పించారు. ఆయన్ను డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి స్థానం నుండి తొలగిస్తూ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. అయితే ఇందుకు కారణాలను అందులో చెప్పలేదు. డీఎంకే ప్రభుత్వం నిరుపేద గృహిణులకు ప్రతినెలా రూ.1,000 నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేసే ‘కలైంజర్ మహిళా సాధికారిక పథకం’ గురించి ఓ సభలో వివరిస్తూ పొన్ముడి మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఒక సెక్స్ వర్కర్ గురించి మాట్లాడే క్రమంలో హిందూ మత చిహ్నాలను లైంగిక భంగిమలతో పోలుస్తూ ఆయన చేసిన వివాదాస్పద జోక్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి సహా విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేశారు.