BJP: ఓటమి భయంతో డీఎంకేలో వణుకు..
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:36 PM
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలలోపే మిత్రపక్షాలు అధిక సీట్ల కోసం పట్టుబట్టి కూటమి నుంచి వెళ్లిపోతాయని, ఆ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని డీఎంకే నేతలకు వణుకు పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు.

- బీజేపీ నేత నయినార్‌నాగేంద్రన్
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలలోపే మిత్రపక్షాలు అధిక సీట్ల కోసం పట్టుబట్టి కూటమి నుంచి వెళ్లిపోతాయని, ఆ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని డీఎంకే నేతలకు వణుకు పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) విమర్శించారు. గురువారం ఉదయం ఆయన పార్టీ నేతలతో కలిసి వడపళనిలోని మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ డీఎంకే కూటమిలో ఇప్పటికే డీపీఐ అలకపాన్పు వహిస్తోందని, ఈసారి 15 స్థానాలను కేటాయించాలంటూ పట్టుబడుతోందన్నారు.
మదురైలో ఈ నెల 22న జరుగనున్న మురుగన్ భక్తుల మహానాడు కోసం తామంతా పక్షం రోజులపాటు వ్రతమాచరిస్తున్నామని, ఆ కారణంగానే రోజూ సమీప ప్రాంతాల్లో ఉన్న మురుగన్ ఆలయాలను దర్శించుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan) కూడా మురుగన్ భక్తుల మహానాడుకు హాజరుకానుండడంతో ఆయన కూడా దీక్ష కొనసాగిస్తున్నారని నయినార్ నాగేంద్రన్ తెలిపారు.
దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు హిందూమున్నాని ఆధ్వర్యంలో జరిగే ఈ మహానాడు గురించి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మురుగన్ భక్తుల మహానాడు జరిగినప్పుడు తామెవరూ విమర్శలు చేయలేదన్నారు. మురుగన్ మహానాడు జరిపితే మత ఘర్షణలు జరుగుతాయని మంత్రి శేఖర్‌బాబు చెబుతుండటం ఓర్వలేనితనానికి నిదర్శనమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి.
జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు
Read Latest Telangana News and National News