CM Shivakumar: కుర్చీ దక్కించుకోవడం సులభం కాదు
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:27 AM
సీఎం పదవి విషయంలో రెండు రోజులుగా ముభావంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్..

బెంగళూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): సీఎం పదవి విషయంలో రెండు రోజులుగా ముభావంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు న్యాయవాదుల సంఘం నిర్వహించిన కెంపే గౌడ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. ముందు భాగంలో ఉన్న కుర్చీల్లోకి రావాలని న్యాయవాదులకు సూచించారు. ‘కుర్చీ దక్కించుకోవడం అంత సులభం కాదు. అవకాశం ఎప్పుడు వచ్చినా ఉపయోగించుకోవాలి’ అని నవ్వుతూనే సీఎం కుర్చీ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘మీ అందరికీ సహజంగానే త్యాగ గుణం అబ్బినట్టుంది. అందుకే ముందున్న కుర్చీలు ఖాళీగా ఉన్నా కూర్చోకుండా వదిలేశారు. మంచి భవంతిలో మంచి కుర్చీ దొరికినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. వెంటనే కూర్చోవాలి’ అని అన్నారు.