DK Shivakumar: సైకిలు దిగుతూ కిందపడిన డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:16 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎకో వాక్ ర్యాలీలో డీకే శివకుమార్ మంగళవారం పాల్గొన్నారు. సైకిల్ పై విధాన సౌధకు వచ్చారు.

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)కు మంగళవారం నాడు స్వల్ప ప్రమాదం జరిగింది. బెంగళూరులోని విధాన సౌధ సమీపంలో సైకిల్ తొక్కుతుండగా ఇది చోటుచేసుకుంది. సైకిల్‌పై విధాన సౌధ మెట్ల దగ్గరకు చేరుకున్న సమయంలో ఆయన బ్యాలెన్స్ కోల్పోవడంతో కింద పడ్డారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను పైకి లేవదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు వీడియో షేర్ చేస్తూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
దీనికి ముందు డీకే శివకుమార్ మంగళవారం ఉదయం విధాన సభకు సైకిల్‌పై వెళ్తున్న ఫోటోను సోషల్ మీడియా 'ఎక్స్'లో షేర్ చేశారు. 'అధికార కారిడార్లలో నేను సైకిల్ ఎంచుకున్నాను. ఎందుకంటే ప్రగతికి ప్రతిసారి హార్స్‌పవర్ అవసరంలేదు, పీపుల్ పవర్ చాలు'' అని క్యాప్షన్ పెట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బెంగళూరులో మంగళవారంనాడు ఎకో వాక్ నిర్వహించగా, డీకే అందులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమాన సర్వీసు రద్దు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి