Dharmasthala Mass Burial Case: ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:11 PM
ధర్మస్థల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలు, యువతులు, బాలికులను అంతమొందించి.. వారి మృతదేహాలను ఎవరికీ తెలియకుండా భూమిలో పాతిపెట్టారు.

బెంగళూరు, ఆగస్ట్ 03: ధర్మస్థల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ ధర్మస్థలలో దాదాపు 15 ఏళ్లలో చోటు చేసుకున్న అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులన్నీ మాయమయ్యాయి. ఈ విషయం ఆర్టీఐ చట్టం ద్వారా ఆదివారం బహిర్గతమైంది. 2000 నుంచి 2015 మధ్య బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌లో అదృశ్యమైన మహిళలు, యువతులు, బాలికలకు చెందిన రికార్డులన్నీ గల్లంతయ్యాయి. ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఆదివారం వెల్లడించారు. ఇదే సమయంలో ఆనుమానాస్పద మరణాలపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయని ఆయన గుర్తు చేశారు.
అయితే తాను వందకు పైగా మహిళలు, యువతుల మృతదేహాలను పూడ్చిపెట్టానంటూ ఒక పారిశుద్ధ్య కార్మికులు ప్రకటించిన వేళ.. పోలీస్ స్టేషన్‌లో రికార్డులు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. అదీకాక.. ఈ రికార్డులన్నీ ఒక క్రమ పద్దతిలో మాయం చేసినట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైందని జయంత్ పేర్కొన్నారు. అయితే ఇదే అంశంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఫిర్యాదు చేసినట్లు జయంత్ వివరించారు.
ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా పాతపెట్టడం తాను చూశానని.. అధికారులు సైతం అక్కడే ఉన్నారని జయంత్ సంచలన విషయం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సదరు మృతదేహాన్ని సిట్ అధికారులు వెలికి తీయాల్సి ఉందన్నారు. అయితే ఈ యువతుల గల్లంతుపై పోలీసుల పనితీరు తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆర్టీఐను ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలో ఆచూకీ గల్లంతైన వ్యక్తులు, వారి ఫొటోలను తాను చాలా కాలం క్రితమే బెళ్తంగడి పోలీసులను అడిగినట్లు తెలిపారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన ఫొటోలు, వాల్ పోస్టర్లు, పోస్ట్‌మార్టం నివేదికలు అన్ని ఒక పథకం ప్రకారం పోలీసులు నాశనం చేశారని వివరించారు జయంత్. దీనిపై శనివారం సిట్ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. గతంలో యువతి మృతదేహం పోలీసులకు లభించిందని.. అయితే వారు ఆ మృతదేహాన్ని అత్యంత దారుణంగా పాతిపెట్టారని చెప్పారు.
ఇప్పుడు మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు లభించినా.. వాటిని వేటితో సరి పోల్చుతారని ఆర్టీఐ కార్యకర్త జయంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. దీనిపై ఇంతగా ఎవరు ప్రభావం చూపించారని ప్రశ్నించారు. ఈ రికార్డులను కంప్యూటర్ బ్యాక్ అప్ ద్వారా వెనక్కి తీయాల్సిన అవసరం ఉందని జయంత్ అభిప్రాయపడ్డారు.
దేనికి ఆధారం లేకుండా నాశనం చేశారంటే ఎలా నమ్మాలని, దీనిపై క్షుణ్ణంగా దర్యాపు జరపాలన్నారు. మరోవైపు తన వెనుక ఎవరూ లేరని ఆర్టీఐ కమిషనర్ కుండబద్దలు కొట్టారు. ఈ అంశం తనపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అందుకే వీటిని తేల్చాలని తాను నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు టెకీలు అరెస్ట్
తొలి రోజు జైలులో ప్రజ్వల్ రేవణ్ణ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి