Share News

DGCA: పాక్‌ గగనతలంలోకి నో ఎంట్రీ.. డీజీసీఏ కీలక సూచన

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:02 PM

DGCA: పహల్గాంలో ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు ఎవరికి వారు ఆంక్షలు విధించుకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ గగనతలంలోకి భారత్ విమానాలకు నో ఎంట్రీ అంటూ ప్రకటించాయి.

DGCA: పాక్‌ గగనతలంలోకి నో ఎంట్రీ.. డీజీసీఏ కీలక సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్,పాక్ దేశాల మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా మారాయి. ఆ క్రమంలో భారత్ నుంచి వివిధ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాలు రాకుండా పాకిస్థాన్‌ గగనతలం మూసివేసింది. దీంతో విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శనివారం కీలక సూచనలు చేసింది.

పాక్ గగనతలంలోకి భారత్ విమానాలు నో ఎంట్రీ కారణంగా.. విమాన ప్రయాణ సమయం పెరిగినట్లు తెలిపింది. దాంతో విమానయాన సంస్థలకు పలు సూచనలు చెప్పింది. విమానాల ల్యాండిగ్, టేకాఫ్‌లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని సూచించింది. అలాగే విమానాల్లో ప్రయాణికులకు భోజనం, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, ఇతరత్రా సేవలను అందుబాటులో ఉంచాలని సూచించింది.


మరోవైపు ఇదే అంశంపై ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కీలక ప్రకటనలు చేశాయి. పాకిస్థాన్ తాజా షరతులు కారణంగా.. ఉత్తర అమెరికా, యూరప్,బ్రిటన్,మధ్య ప్రాచ్య దేశాల నుంచి రాక పోకలు సాగిస్తున్న విమానాలు మరింత ఆలస్యమవుతోందని తెలిపింది. ఆ యా ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించింది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నామంది. విమాన సిబ్బందితోపాటు ప్రయాణికుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఆ యా విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి.

ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకొంది. దీంతో పాక్ పై ఆంక్షలు విధించింది. అలాగే భారత్‌పై పాక్ సైతం తన ఆంక్షలు విధించింది. ఆ క్రమంలో తమ గగనతలంలో భారత్ విమానాలు ప్రయాణించరాదని ఆ దేశానికి స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నాయి. అలాంటి వేళ డీజీసీఏ కీలక సూచనలు చేసింది.

ఇవి కూడా చదవండి..

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Pahalgam Terror Attack: ముమ్మర తనిఖీలు.. పోలీసులు అదుపులో 400 మంది

Pahalgam Terror Attack: మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..

Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 01:09 PM