Devendra Fadnavis: దగ్గరవుతున్న థాకరే సోదరులు.. దేవేంద్ర ఫడ్నవిస్ స్పందనిదే
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:45 PM
మహారాష్ట్ర సంస్కృతి, భాషాపరమైన గుర్తింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, దీనిపై విభేదాలు మరచి ఉద్ధవ్ థాకరేతో పనిచేసేందుకు సిద్ధమేనని రాజ్‌థాకరే ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు తమ మధ్య ఉన్న విభేదాలు చాలా స్పల్పమవుతాయని అన్నారు.

ముంబై: ఒకటో తరగతి నుంతి ఐదో తరగతి వరకూ హిందీ భాషను విధిగా బోధించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే సోదరులు విభేదిస్తున్నారు. దీనిపై సమైక్యంగా పోరాడేందుకు ఉభయులూ ఏకం కానున్నరంటూ చర్చ కూడా మొదలైంది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తొలిసారి స్పందించారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో వర్ష బీభత్సం.. మెరుపు వరదల్లో ముగ్గురు మృతి
"తిరిగి వారిద్దరూ ఏకం కావాలని అనుకుంటే తమకు సంతోషమేనని అన్నారు. ఎవరైనా సరే విభేదాలు పరిష్కరించుకుంటే మంచి విషయమే. అంతకంటే నేను చెప్పేదేముంది?'' అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
సంకేతాలిచ్చిన థాకరే సోదరులు
మహారాష్ట్ర సంస్కృతి, భాషాపరమైన గుర్తింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, దీనిపై విభేదాలు మరచి ఉద్ధవ్ థాకరేతో పనిచేసేందుకు సిద్ధమేనని రాజ్‌థాకరే ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు తమ మధ్య ఉన్న విభేదాలు చాలా స్పల్పమవుతాయని, మహారాష్ట్ర, మహారాష్ట్ర ప్రజల విషయానికి వచ్చే సరిగి విభేదాలు లెక్కలోకి రావని చెప్పారు. ఇరుపక్షాలు ఆసక్తిగా ఉంటే కలిసి పనిచేందుకు సిద్ధమేనని చెప్పారు. ఉద్ధవ్ థాకరే సైతం మరో కార్యక్రమంలో తమ మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం పక్కన పెట్టేసేందుకు సిద్ధమేనని అన్నారు. అయితే మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే వాళ్లను దగ్గరకు రానీయకూడదని చెప్పారు. ఒకే మాట మీద ఉండాలన్నారు.
సంజయ్ రౌత్ వివరణ
శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మధ్య లాంఛనంగా అవగాహన కుదిరందంటూ వస్తున్న ఊహాగానాలపై శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. ప్రస్తుతానికి ఎలాంటి పొత్తు లేదని, భావోద్వేగమైన సంభాషణలుగానే చూడాల్సి ఉంటుందని అన్నారు. "వాళ్లిద్దరూ సోదరులు. అంతా చాలా ఏళ్లు కలిసి ఉన్నాం. ఆ బంధం ఎప్పటికీ తెగిపోదు. రాజకీయంగా కలిసి వస్తారా అనేది వారి నిర్ణయం"అని రౌత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..