Share News

Delhi Fire Engulfs: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

ABN , Publish Date - Nov 30 , 2025 | 08:35 AM

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో మంటలు చెలరేగగా.. ప్రమాదాన్ని పసిగట్టి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.

Delhi Fire Engulfs: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
Delhi Fire Accident

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది(Delhi Fire Accident). దక్షిణ ఢిల్లీ ప్రాంతం సంగం విహార్‌(Sangam Vihar)లోని ఓ నివాస భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు(Four people died). మరో ఇద్దరు గాయపడ్డారు(Two Injured).


మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు.. బిల్డింగ్ యజమాని సతీందర్ గుప్తా(38), ఆయన సోదరి అనిత(40) సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించారు. ఆ వ్యక్తితో సహా మృతిచెందిన మరొకరు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మమత(40) అనే మహిళ కాలిన గాయాలతో బయటపడ్డారు. మరో మహిళ తనను తాను రక్షించుకోవడంలో భాగంగా టెర్రస్‌పై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.


తేరుకునేలోపే..

శనివారం సాయంత్రం సుమారు 6:24 గంటల సమయంలో ఆ భవనంలో నుంచి మంటలు చెలరేగాయి. అయితే.. ప్రమాదం జరిగిందని పసిగట్టి తేరుకునేలోపే భవనమంతా మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక దళాలు(Fire Officials) వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అప్పటికే ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి. ఈ కేసుపై సంబంధిత పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు(Police Investigating).


ఇవీ చదవండి:

కర్ణాటకానికి తెర

సర్‌పైనే సమరం

Updated Date - Nov 30 , 2025 | 08:45 AM