Delhi BJP Govt: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్!
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:53 AM
15 సంవత్సరాలు దాటిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ సర్కార్ నిర్ణయం.. మార్చి 31 తర్వాత అమల్లోకి
న్యూఢిల్లీ, మార్చి 1: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం మార్చి 31 తర్వాత అమలులోకి వస్తుందని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం అధికారులతో భేటీ అనంతరం తెలిపారు. ‘‘ఢిల్లీలో కాలుష్య కట్టడికి కంకణబద్ధులై ఉన్నాం. 15 సంవత్సరాలు పైబడిన వాహనాలను గుర్తించడానికి పెట్రోల్ బంకుల్లో గాడ్జెట్లు ఏర్పాటు చేస్తాం. గడు వు దాటిన వాహనాలను అవి గుర్తిస్తాయి. వాటికి పెట్రో ల్, డీజిల్ ఉండదు. ఈ ఆంక్షలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర పెట్రోలియం శాఖకు పంపిస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.