Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా విమానం మళ్లించడంపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వివరణ
ABN , Publish Date - Apr 20 , 2025 | 08:19 PM
రాత్రి సమయంలో ఢిల్లీకి బయలుదేరిన తన విమానం 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై జైపూర్‌కు మళ్లించారని ఒమర్ అబ్దుల్లా సామాజిక మధ్యామాల్లో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జైపూర్‌లో విమానం దిగిన తర్వాత మెట్లపై నిలబడి గాలి పీల్చుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేశారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) శనివారం రాత్రి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానాన్ని జైపూర్‌కు మళ్లించడంపై అసహనం వ్యక్తం చేశారు. మూడు గంటల సేపు తాము గాలిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, జైపూర్‌కు మళ్లించి, ఎట్టకేలకు తెల్లవారు జామున 3 గంటలకు విమానం ఢిల్లీకి చేర్చారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఆయనకు ఒక ట్వీట్‌లో వివరణ ఇచ్చారు. మౌలిక సదుపాలకు సంబంధించిన పనులు జరుగుతుండటం,వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం కారణాలుగా తెలిపింది.
Bengaluru: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఢీ కొన్న టెంపో..
''ఢిల్లీలో అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం, గాలులు దిశ మార్చుకోవడంపై మేము పలు అడ్వయిజరీలు జారీ చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇందుకు సంబంధించి అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఐఎల్ఎస్ అప్‌గ్రేడేషన్ కోసం ఏప్రిల్ 8వ తేదీ నుంచి 10/28 రన్‌వేను మూసేశాం. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికుల భద్రతే ప్రధానంగా కొన్ని సార్లు విమానాలను దారిమళ్లించాల్సి వస్తుంది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం'' అని అధికారులు వివరణ ఇచ్చారు.
దీనికి ముందు, ఒమర్ అబ్దుల్లా తనకు కలిగిన అసౌకర్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఢిల్లీకి బయలుదేరిన తన విమానం 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై జైపూర్‌కు మళ్లించారని సామాజిక మధ్యామాల్లో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జైపూర్‌లో విమానం దిగిన తర్వాత మెట్లపై నిలబడి గాలి పీల్చుకుంటున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయ నిర్వహణపై మండిపడుతూ ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో తెలియడం లేదన్నారు. ఎట్టకేలకు తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఢిల్లీకి చేరినట్టు మరో పోస్టులో తెలిపారు.
ఇవి కూడా చదవండి..