Share News

PM Modi: సహనానికి మారుపేరు దలైలామా

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:58 AM

టిబెటన్‌ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఆదివారం ధర్మశాలలో వైభవంగా జరిగాయి.

PM Modi: సహనానికి మారుపేరు దలైలామా

ధర్మశాల, జూలై 6: టిబెటన్‌ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఆదివారం ధర్మశాలలో వైభవంగా జరిగాయి. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘140 కోట్ల భారతీయులతో పాటు నేను కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. దలైలామా ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు మారుపేరు. ఆయన దీర్ఘాయువు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Jul 07 , 2025 | 02:58 AM