Renuka Chowdhury: శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:53 PM
పెంపుడు జంతువులను పార్లమెంటుకు తీసుకురావడం ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్ అన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి (Renuka Chowdhury) కారులో ఒక కుక్కను పార్లమెంటు ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఇది గమనించిన భద్రతాసిబ్బంది ఆ కుక్కను తిరిగి ఆమె నివాసానికి పంపేశారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను దుర్వినియోగం చేయడమమే అవుతుందని విమర్శించింది. అయితే దీనిపై రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు.
'ఒక మూగజీవి కారులో ఉండే వారికి ఎందుకు అంత ఇబ్బంది? దీనిపై ఏదైనా చట్టం ఉందా? నేను వస్తుండగా దారిలో ఒక స్కూటరు, కారు ఢీకొన్నాయి. చిన్న కుక్క రోడ్డుపై తిరుగుతోంది. దానికి దెబ్బతగిలి ఉంటుందని అనిపించి దానిని కారులో ఎక్కించుకున్నాను. నేరుగా పార్లమెంటుకు వచ్చాను. వెంటనే దాన్ని వెనక్కి పంపించేశాను. కారు వదిలిపెట్టినట్టే కుక్క విషయంలోనూ చేశాను. దీనిపై చర్చించేదేముంది? కుక్కపిల్ల ఎవరినీ కరవదు. నిజంగా కాట్లు పడిన వారు పార్లమెంటులో కూర్చున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము మూగజీవాలను ప్రేమిస్తాం. పార్లమెంటులో కూర్చుని ప్రతిరోజూ మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మేము మాట్లాడదలచు కోలేదు' అని అన్నారు.
బీజేపీ స్పందన
రేణుకాచౌదరి చర్యను బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తప్పుపట్టారు. పెంపుడు జంతువులను పార్లమెంటుకు తీసుకురావడం ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. జవాబుదారీతనం అనేది తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే
బాధ నుంచి బయటకు రండి: ప్రతిపక్షాలకు ప్రధాని కీలక సూచన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి