MLA: ధర్మం కోసమే కాషాయ శాలువా.. మూడేళ్ల తర్వాత కాంగ్రెసో.. బీజేపీనో చూద్దాం
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:03 PM
హిందువుగా దళిత సమాజంలో మూడగెరెలో జన్మించానని, భవిష్యత్తులో బీజేపీకి వెళ్తానో కాంగ్రెస్‌లో ఉంటానో, బీఎస్పీ లేదా ఎస్‌డీపీఐలో చేరుతానో అనేది వేచిచూద్దామని మూడిగెరె కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన మోటమ్మ అన్నారు. బుధవారం మూడిగెరెలో హిందూమహాసభ ఆధ్వర్యంలో గణపతి సమితి సమావేశంలో లోగో విడుదల చేశారు.

ఎమ్మెల్యే నయన మోటమ్మ
బెంగళూరు: హిందువుగా దళిత సమాజంలో మూడగెరెలో జన్మించానని, భవిష్యత్తులో బీజేపీకి వెళ్తానో కాంగ్రెస్‌లో ఉంటానో, బీఎస్పీ లేదా ఎస్‌డీపీఐలో చేరుతానో అనేది వేచిచూద్దామని మూడిగెరె కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన మోటమ్మ(Mudigere Congress MLA Nayana Motamma) అన్నారు. బుధవారం మూడిగెరెలో హిందూమహాసభ ఆధ్వర్యంలో గణపతి సమితి సమావేశంలో లోగో విడుదల చేశారు.
శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్‌తో కలసి వేదిక పంచుకున్న వేళ ఆమె కాషాయం శాలువా ధరించారు. ఇదే సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను గణపతికోసం ధర్మంకోసం వచ్చానని, ఎమ్మెల్యేగా పార్టీ ప్రతినిధిగా వ్యవహరించేది ఆ తర్వాత అన్నారు. గణపతి సమితి కార్యాధ్యక్షురాలిగా హాజరయ్యానన్నారు.
ఏ పార్టీవారు అనేది ఇక్కడ ముఖ్యం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నానని, దాంతోపాటు పలు అస్థిత్వాలతో కలిపి నయన మోటమ్మ అయ్యానన్నారు. పుట్టుక తర్వాతనే కులం, మతం, ఆడ, మగగా నిర్ధారణ అవుతుందని అంతమాత్రాన అన్నింటికీ విమర్శలు సరికాదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం
Read Latest Telangana News and National News