Nikhil: గ్యారెంటీల పేరుతో ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:36 PM
రాష్ట్ర ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ, గ్యారంటీల పేరిట రాష్ట్రాన్ని నిలువు దోపిడీచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని జేడీఎస్ పార్టీ రాష్ట్ర యువఅధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు.

- జేడీఎస్ రాష్ట్ర యువ అధ్యక్షుడు నిఖిల్
బెంగళూరు: రాష్ట్ర ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ, గ్యారంటీల పేరిట రాష్ట్రాన్ని నిలువు దోపిడీచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని జేడీఎస్ పార్టీ రాష్ట్ర యువఅధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆంజనేయశెట్టి కల్యాణమండపంలో నిర్వహించిన జెడీఎస్ పార్టీ మిస్డ్‌కాల్ అభియాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ తాలూకాలో నిధులను దుర్వినియోగం చేసి తెలంగాణ(Telangana)లో నడిచిన ఎన్నికలకు ఆ నిధులను వాడుకున్న ప్రభుత్వ కాంగ్రెస్ అని అన్నారు.
కుమారస్వామి అధికారంలోకి వస్తే పంచరత్న యోజన పథకాలను ఇస్తామన్న హామీలను విమర్శించే హక్కు ఏ పార్టీకి లేదని అన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి పేరిట మోసం చేస్తూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం సిద్దరామయ్యకు సిగ్గుచేటన్నారు. 2028లో ముచ్చటగా మూడోసారి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నారని అందుకు మిస్డ్‌కాల్ చివరి నంబరు 2028అని రావడం కూడా అదృష్టమన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు రష్మిక, పావగడ తాలూకా అధ్యక్షులు ఈరన్న, గోవిందబాబు, ఎస్‌కె రెడ్డి, అంజప్ప, జెడీఎస్ నాయకులు సురేంద్ర, చిన్న మల్లయ్య, జిల్లా మహిళ అధ్యక్షురాలు తహీరాబాను, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప సెల్‌ఫోన్ చోరీ
నిఖిల్ కుమారస్వామి పావగడలో మిస్డ్‌కాల్ అభియాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పావగడ మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప ఫోన్ చోరీకి గురైంది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!
సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి
Read Latest Telangana News and National News