Share News

CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:17 AM

CM Yogi Emotional Video: పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయాడు. శుభం కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన యూపీ సీఎం యోగి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
CM Yogi Emotional Video

కాన్పూర్, ఏప్రిల్ 25: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా విహార యాత్రకు వచ్చిన వారికి విషాదమే మిగిలింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది ఒకరు. భార్యతో కలిసి శుభం వివాహరయాత్రకు పహల్గామ్‌కు వచ్చి ఉగ్రతూటాలకు బలయ్యారు. శుభంకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. విహహం జరిగి, ఎంతో మంచి భవిష్యత్‌ ఉన్న శుభం.. ముష్కురుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రతిఒక్కరినీ కలిచి వేసింది. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర భావోద్వేనికి గురయ్యారు. కన్నీరు పెట్టున్నారు. యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


ఉగ్రమూకల దాడిలో అమరుడైన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ సీఎం వెళ్లారు. సీఎంను చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరుగా విలపించారు. శుభం తండ్రిని ముఖ్యమంత్రి ఓదార్చారు. తప్పుకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శుభం తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే సంతానమని, రెండు నెలల క్రితమే వివాహం జరిగినట్లు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే శుభం కుటుంబ సభ్యులకు సీఎం యోగి సానుభూతిని తెలియజేశారు.


కాగా.. శుభం ఇంటికి సీఎం యోగా వెళ్లగానే అక్కడ ఒక ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. సీఎంను చూడగానే శుభం కుటుంబసభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా శుభం భార్య చెప్పిన మాటలతో ముఖ్యమంత్రి యోగి కూడా చలించిపోయారు. ‘ఉగ్రమూకల దాడిలో నా భర్త మరణించాడు.. సార్ మేము ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాం’ అంటూ కన్నీరు పెట్టుకుంటూ ఐష్ణయ చెప్పిన మాటలతో యూపీ సీఎం కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని.. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యూపీ సీఎం యోగీ.. శుభం ఇంటి నుంచి కన్నీరు పెట్టుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక.. శుభం ద్వివేది అంత్యక్రియలు నిన్న(గురువారం) ప్రభుత్వ అధికారికి లాంఛనాలతో నిర్వహించారు. దేవోరి ఘాట్‌లో వేలాది మంది ప్రజలు శుభంకు కన్నీటితో వీడ్కోలు పలికారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

Pahalgam Terror Attack: పాక్‌పై భారత్ ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు ఏవంటే..

Read Latest National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 11:36 AM