Share News

CM Stalin: ఏం చేస్తారో తెలియదు.. కోవైలో అన్నీ గెలవాల్సిందే..

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:01 PM

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్‌చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు.

CM Stalin: ఏం చేస్తారో తెలియదు.. కోవైలో అన్నీ గెలవాల్సిందే..

- పార్టీ ఇన్‌చార్జులకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ దిశానిర్దేశం

చెన్నై: వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా నియోజకవర్గాల ఇన్‌చార్జులు గట్టిగా ప్రయత్నించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని స్టాలిన్‌ జూలై నుంచి ‘ఉడన్‌ పిరప్పే వా’ పేరుతో నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన 80 నియోజక వర్గాల నేతలతో సమావేశమయ్యారు.


nani3.2.jpg

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కోయంబత్తూరు జిల్లాలోని సూలూరు, కినత్తుకడవు, వాల్పారై నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో వరుసగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో డీఎంకే లేదా దాని మిత్రపక్షాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెడితే సులువుగా గెలుస్తారో సూచించాలని, డీఎంకే తరఫున పోటీ చేయడానికి అంగబలం, ఆర్థిక బలం కలిగిన అభ్యర్థులుంటే తమకు ప్రతిపాదనలు పంపాలని స్టాలిన్‌ కోరారు. అదే సమయంలో కోయంబత్తూరు జిల్లా పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ జిల్లా అంతటా అన్ని నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల విజయానికి ప్రణాళికలు, వ్యూహరచన రూపొందించుకుని ఇంటింటి ప్రచారానికి వెళ్ళాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో ఆ జిల్లాలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులెవరూ గెలువకుండా చూడాలని స్టాలిన్‌ కోరారు.


ప్రధాని మోదీకి సీఎం లేఖ

రాష్ట్రంలో రైతుల సంక్షేమం దృష్ట్యా వరిలో తేమశాతాన్ని 17 నుండి 22 శాతంగా పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం దిగుబడి వచ్చిందని, ప్రస్తుతం వర్షాల వల్ల ప్రభుత్వ గోదాముల్లో ఉన్న వరిలో తేమ శాతం పెరుగుతూనే ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని 22 శాతం తేమ కలిగిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2025 | 01:19 PM