Share News

CM Stalin: ఆ జనాన్ని చూసి ఈపీఎస్‏కు వణుకు..

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:50 AM

రాష్ట్రవ్యాప్తంగా ‘ఉంగలుడన్‌ స్టాలిన్‌’ పేరుతో ప్రారంభమైన ప్రజావిజ్ఞప్తుల శిబిరాలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి వణకుపుట్టి, విమర్శల పేరుతో డీఎంకే ద్రావిడ తరహా పాలనకు విస్తృత ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఎద్దేవా చేశారు.

CM Stalin: ఆ జనాన్ని చూసి ఈపీఎస్‏కు వణుకు..

- విమర్శల పేరుతో ప్రభుత్వానికి ప్రచారం

- మైలాడుదురై సభలో సీఎం స్టాలిన్‌

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ‘ఉంగలుడన్‌ స్టాలిన్‌’ పేరుతో ప్రారంభమైన ప్రజావిజ్ఞప్తుల శిబిరాలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి వణకుపుట్టి, విమర్శల పేరుతో డీఎంకే ద్రావిడ తరహా పాలనకు విస్తృత ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఎద్దేవా చేశారు. మైలాడుదురై మనపందల్‌ ఏవీసీ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన సభలో ఆ జిల్లాలో రూ.432.92 కోట్లతో పూర్తయిన 47 పథకాలను ప్రారంభించి, కొత్తగా చేపట్టనున్న 12 పథకాలకు శంకుస్థాపన చేసి, 54,461 మంది లబ్దిదారులకు సహాయాలను పంపిణీ చేశారు.


ఆ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ఉంగలుడన్‌ స్టాలిన్‌ పథకం గురించి తాను ప్రకటన చేయగానే ప్రతిపక్షనాయకుడు ఈపీఎ్‌సకు మంటపుట్టిందని, విజ్ఞప్తులు అందజేయడానికి వచ్చే జనాన్ని చూసి, అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లటం చూసి ఈర్ష్య కలిగి పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు స్టాలిన్‌ ఊరూరా తిరిగి ప్రజలనుండి స్వీకరించిన విజ్ఞప్తులు ఏమయ్యాయంటూ ఆయన ప్రశ్నించారని, ఆ విజ్ఞప్తులన్నీ ఎక్సెల్‌షీట్లుగా, వర్క్‌షీట్లుగా మారి పరిష్కారమయ్యాయని వెల్లడించారు. కలైంజర్‌ మహిళా సాధికారిక నగదు పథకం అమలు చేయలేరని ఆరోపించిన ఈపీఎస్‌ ప్రస్తుతం అన్నాడీఎంకేకు చెందిన గృహిణులు కూడా ప్రతినెలా రూ.1000లు పొందుతున్న విషయాన్ని గమనించలేదా అని స్టాలిన్‌ ప్రశ్నించారు. వెలుగుబాట పయనం ద్వారా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి ప్రతినెల రూ.800ల వరకు పొదుపు చేయగలుగుతున్నారని, వారి ఆర్థికస్థితి మెరుగైందన్న విషయాలు ఈపీఎ్‌సకు తెలియకపోవడం శోచనీయమన్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఈపీఎస్‏కు గుడ్‌బై...

ప్రతిపక్షనేత ఈపీఎస్‌ 2019 నుండి వరుసగా పది సార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓటమినే చవిచూశారని, ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు టాటా చెబుతూ వచ్చారని, వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఆయనకు గుడ్‌బై చెప్పటం ఖాయమని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇటీవల ఈపీఎస్‌ ప్రతిపక్షనేత అనే విషయాన్ని కూడా మరచి మహిళలను కించపరిచేలా విమర్శించారని, వెయ్యి రూపాయల కోసం మోసపోవద్దంటూ మహిళలకు హితవు చెప్పి తన స్థాయిని దిగజార్చుకున్నారని, ప్రజలు, మహిళలు ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మోసపోలేదని, ప్రస్తుతం బీజేపీ ఎత్తుగడల వల్ల చిత్తుగా మోసపోనున్నదని ఆయనేనన్నారు.


nani2.2.jpg

బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరేనంటూ గొప్పలు చెప్పుకున్న ఈపీఎస్‌ ఐటీ, ఈడీ దాడులకు భయపడి బీజేపీ జాతీయ నేతల గులాముగా మారి ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారని స్టాలిన్‌ ఆరోపించారు.

ఈ సభలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, మెయ్యనాథన్‌, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌, టాడ్కో చైర్మన్‌ ఇలయరాజా, పార్లమెంట్‌ సభ్యురాలు సుధా, శాసనసభ్యులు నివేదా మురుగన్‌, పన్నీర్‌సెల్వం, రాజ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


సభ్యత్వ కార్యక్రమంలో...

ముఖ్యమంత్రి స్టాలిన్‌ మైలాడుదురై పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కుత్తాలం సమీపం వళువూరులో ఎనిమిది అడుగుల మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఆ తర్వాత మనపందల్‌ గ్రామ ంలో ‘ఏకతాటిపై తమిళనాడు’ పేరుతో సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడున్న ఇళ్ల వెళ్లి డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ముద్రించిన కరపత్రాలను అందించారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వ ఫారాలను అందజేసి డీఎంకేలో చేరమంటూ విజ్ఞప్తి చేశారు. ఆ ఇళ్ళలో చాలా మంది స్టాలిన్‌ నుండి పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా ప్రతి ఇంటిలో కూర్చుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలేవైనా ఉంటే ఉంగలుడన్‌ స్టాలిన్‌ విజ్ఞప్తుల స్వీకరణ శిబిరాలలో వినతిపత్రాలు సమర్పించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 11:50 AM