Siddaramaiah: సీఎంకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ABN , Publish Date - Feb 02 , 2025 | 08:18 PM
సిద్ధరామయ్య ఎడమ మోకాలికి గతంలో శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడది తిరగబెట్టిందని, దీంతో సీఎం నివాసంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారంనాడు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఎడమకాలి నొప్పితో సీఎం బాధపడుతుండటంలో బెంగళూరులోని మణిపూర్ ఆసుపత్రిలో చేరారు. రెండ్రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Chhattisgarh: మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు
సిద్ధరామయ్య ఎడమ మోకాలికి గతంలో శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడది తిరగబెట్టిందని, దీంతో సీఎం నివాసంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది. మోకాలికి వైద్యులు స్కానింగ్ చేశారని, లిగ్మెంట్ సర్జరీ మీద ఒత్తిడి కారణంగా నొప్పి తీవ్రమైనట్టు చెప్పారని, ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేనందున రెండు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ఆ ప్రకటన తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి