Journalists Pension: జర్నలిస్టులకు పెన్షన్ పెంచిన సీఎం
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:14 PM
ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పాట్నా: అర్హులైన జర్నలిస్టులకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) శుభవార్త చెప్పారు. 'బిహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్' కింద అర్హులైన పాత్రికేయులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.6,000 నెలసరి పెన్షన్‌ను రూ.15,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పెన్షన్ అందుకుంటున్న పాత్రికేయుడు ఎవరైనా మరణిస్తే ఆయన భార్యకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3,000 నెలవారీ పెన్షన్‌ను రూ.10,000కు పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
పాత్రికేయుల పాత్ర కీలకం
ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, వితంతు మహిళలకు ఇస్తున్న నెలవారీ పెన్షన్లను రూ.400 నుంచి రూ.1,100కు పెంచినట్టు కూడా నితీష్ శనివారంనాడు ప్రకటించారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఈ నిర్ణయం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే జూలై బిల్లు నుంచే వినియోగదారులు లబ్ధి పొందుతారని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో కోటి ప్రభుత్వ ఉద్యాగాలు, ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు
ఇవి కూడా చదవండి..
సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి