Teacher recruitment: టీచర్ల నియామకంలో స్థానికత.. నితీష్ సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:40 PM
బిహార్ స్థానికులకు టీచర్ల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా సంబంధింత నిబంధనల్లో మార్పు చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు ఇచ్చామనీ, సవరించిన నిబంధనలు టీఆర్ఈ-4 నుంచి వర్తిస్తాయని నితీష్ కుమార్ తెలిపారు.

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో టీచర్ల నియామక విధానం (Teacher recruitment policy)లో కీలకమైన మార్పు చేస్తున్నట్టు తెలిపారు. ఇకముందు టీచర్ల నియామకంలో బిహార్‌లో స్థిరనివాసం కలిగిన వారికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
'బిహార్ స్థానికులకు టీచర్ల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా సంబంధింత నిబంధనల్లో మార్పు చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు ఇచ్చాం. సవరించిన నిబంధనలు టీఆర్ఈ-4 నుంచి వర్తిస్తాయి. 2025 టీచర్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ నాలుగో ఫేజ్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2026లో టీఆర్ఈ-5 ఉంటుంది' అని నితీష్ తెలిపారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం 2005 నవంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థను మెరుగుపరచేందుకు నిరంతరం పనిచేస్తోందని, మరింత పటిష్టం చేసేందుకు పెద్ద సంఖ్యలో టీచర్ల నియామకాలు జరుపుతున్నామని చెప్పారు. టీఆర్ఐ-5కు ముందే రిక్రూట్‌మెంట్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎస్‌టీఈటీ) కూడా నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రజల చిరకాల డిమాండ్‌గా ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానికులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి