Birthday Wishes: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్
ABN , Publish Date - Jun 20 , 2025 | 10:27 AM
Birthday Wishes: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.

Delhi: భారత రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పుట్టినరోజు (Birthday) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రాష్ట్రపతికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేశారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా పోస్టు చేశారు. ‘ఆమె జీవితం మరియు నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి... ప్రజా సేవ, సామాజిక న్యాయం మరియు సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ ఆశ మరియు బలాన్ని ఇస్తుంది. పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆమె ఎల్లప్పుడూ కృషి చేశారు. ప్రజలకు సేవ చేస్తూ ఆమెకు దేవుడు దీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలి’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రముఖ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ‘గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆమెకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని.. భారత దేశానికి జ్ఞానం మరియు కృపతో స్ఫూర్తినిస్తూ ఉండాలని.. ప్రజలకు సేవ చేస్తూ ఆమెకు దేవుడు దీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్
యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ
తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది..: బాలినేని
For More AP News and Telugu News