Chlorine Gas Leak: హడలెత్తించిన క్లోరిన్ గ్యాస్ లీక్.. పలువురికి అస్వస్థత
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:01 PM
క్లోరిన్ గ్యాస్ లీక్ సమాచారంతో అగ్నిమాక సిబ్బంద ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీని నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాసై వెస్ట్ ప్రాంతంలో మంగళవారంనాడు క్లోరిన్ గ్యాస్ లీక్ (Chlorine gas leak) కావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. సుమారు 10 నుంచి 12 మంది అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. బాధితులు శ్వాస సమస్యలు, కళ్లు మంటలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్లోరిన్ గ్యాస్ లీక్ సమాచారంతో అగ్నిమాక సిబ్బంద ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఇంకెలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఆ ప్రాంత వాసులు ముందస్తు జాగ్రత్తగా కొద్దిసేపు ఘటనాస్థలికి దూరంగా ఉండాలని కోరారు.
కాగా, గత శనివారంనాడు ముంబైలోని అంథేరి ప్రాంతంలో కెమికల్ లీక్ కావడంతో 20 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరి తీవ్ర అస్వస్థతతో హోలీ స్పిరిట్ ఆసుపత్రి ఐసీయూలో చేరారు. బాంగర్‌వాడీ ఏరియాలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ రెండతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి..
ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.