Collector: ఆ ఆటోలు పురుషులు నడిపితే స్వాధీనం చేసుకుంటాం..
ABN , Publish Date - May 01 , 2025 | 01:36 PM
పింక్ ఆటోలను పురుషులు నడిపితే స్వాధీనం చేసుకుంటామని జిల్లా కలెక్టర్ రష్మి సిద్దార్ధ్ హెచ్చరించారు. చెన్నైలో మహిళలు, పిల్లల భద్రత దృష్టిలో పెట్టుకుని జీపీఎస్, క్యూ ఆర్ కోడ్ తదితర వసతులతో కూడిన ‘పింక్’ ఆటోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

- ‘పింక్ ఆటో’లు పురుషులు నడిపితే స్వాధీనం
- హెచ్చరించిన చెన్నై జిల్లా కలెక్టర్
చెన్నై: పురుషులు ‘పింక్’ ఆటోలు నడిపితే స్వాధీనం చేసుకుంటామని చెన్నై జిల్లా కలెక్టర్ రష్మి సిద్దార్ధ్ హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో... రాజధాని నగరంలో మహిళలు, పిల్లల భద్రత దృష్ట్యా జీపీఎస్, క్యూ ఆర్ కోడ్ తదితర వసతులతో కూడిన ‘పింక్’ ఆటోలను ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు. ఆటో కొనుగోలులో రూ.లక్ష సబ్సిడీ, బ్యాంకుల నుండి రుణం మంజారుతో మార్చి 8వ తేది ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఈ పథకం ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: తెలుగు రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. అవి ఏయే స్టేషన్లలో ఆగుతాయంటే..
తమిళనాడు మోటారు వాహన చట్టం ప్రకారం, పింక్ ఆటోలు మహిళలే నడపాల్సి ఉందన్నారు. కానీ, నగరంలో అధిక శాతం పింక్ ఆటోలు పురుషులు నడుపుతున్నారని ఫిర్యాదులందాయని తెలిపారు. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి, పింక్ ఆటోలు పురుషులు నడిపితే, వాటిని స్వాధీనం చేసుకుంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు
Read Latest Telangana News and National News