Share News

Char Dham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఎలా నమోదు చేసుకోవాలంటే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:19 AM

Char Dham Yatra 2025 Registration: ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్ర 2025 కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సందర్శకులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..

Char Dham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఎలా నమోదు చేసుకోవాలంటే..
Char Dham Yatra 2025 Registration

Char Dham Yatra 2025 Offline Registration: ఏటా భక్తులు ఆసక్తిగా వేచి చూసే పవిత్ర చార్‌ధామ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హరిద్వార్‌లో 20 కౌంటర్లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ప్రతిరోజూ 1,000 మంది వరకు యాత్రికులు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


రిజిస్ట్రేషన్ వివరాలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : మార్చి 11, 2025 న చార్‌ధామ్ యాత్ర 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది . భక్తులు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్: registrationandtouristcare.uk.gov.in ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు . రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరి .

  • ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ : మార్చి 2, 2025 న ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హరిద్వార్, రిషికేశ్‌లలో మాత్రమే ఆఫ్‌లైన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాత్ర మొదటి 15 రోజులు కౌంటర్లు 24/7 పనిచేస్తాయి . ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా రిజిస్ట్రేషన్ గంటలను సర్దుబాటు చేసే అవకాశముంది.


భక్తుల యాత్ర సజావుగా జరిగేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పార్కింగ్ ఏర్పాట్లు, స్లాట్ నిర్వహణ, రియల్-టైమ్ అప్‌డేట్‌లు వంటి విధానాలను అమలు చేస్తోంది. యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలు రూపొందించారు.


ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోలేని వారు ఉత్తరాఖండ్ టూరిజం కేర్ వెబ్‌సైట్ , మొబైల్ యాప్ లేదా +91 8394833833 కు “యాత్ర” అని పంపడం ద్వారా వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు ఆధార్ కార్డ్ వివరాలు తప్పనిసరి. చార్‌ధామ్ యాత్రకు కొద్ది రోజులే గడువు ఉండటంతో చివరి నిమిషంలో కాకుండా ముందే భక్తులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చార్‌ధామ్ యాత్ర మొదటి నెలలో VIP దర్శనం ఉండదు.


ఆలయాల ప్రారంభ తేదీలు:

గంగోత్రి, యమునోత్రి: ఏప్రిల్ 30, 2025

కేదార్‌నాథ్: మే 2, 2025

బద్రీనాథ్: మే 4, 2025


Read Also: Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్

India Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్

India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం

Updated Date - Apr 28 , 2025 | 11:21 AM