CEC: రెండాకుల గుర్తు వ్యవహారం.. 28న విచారణకు హాజరుకండి
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:46 PM
అన్నాడీఎంకే పార్టీ చిహ్నామైన రెండాకుల గుర్తు విషయంలో ఏర్పడ్డ విభేదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్దామి, పన్నీర్ సెల్వంలను 28ంతేదీన విచారణకు రావాలని ఆదేశించింది.

చెన్నై: అన్నాడీఎంకే గుర్తు రెండాకుల చిహ్నాన్ని ఏ వర్గానికి కేటాయించాలనే విషయంపై ఈ నెల 28న విచారణకు హాజరుకావాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission of India) ఆదేశాలిచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ ఎంపిక చెల్లదని ప్రకటించాలని, రెండాకులు గుర్తును ఆయన వర్గానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్యమూర్తి అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: తమిళ మాధ్యమంలోనే వైద్య విద్య
ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి అన్ని వర్గాల వారిని విచారణ జరిపి తుది నిర్ణయాన్ని ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. అదే సమయంలో కేసీ పళనిసామి, పుగళేంది, ఒపీఎస్ కుమారుడు రవీంద్రనాథ్ సహా ఐదుగురు ఈ వ్యవహారంలో తమ తరఫు వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. అయితే ఆ ఐదుగురికి పార్టీలో సభ్యత్వం లేదని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఈపీఎస్ వర్గీయులు ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విచారణ హైకోర్టులో కొనసాగుతున్నప్పుడు ప్రజాప్రాతినిథ్య చట్టం 29-ఎ ప్రకారం ఓ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల సంఘానికిలేదని, ఎన్నికల సమయంలో పార్టీలకు చిహ్నాలు కేటాయించడమే ఆ సంఘం ప్రధాన విధి అని తెలిపారు. ఓ పార్టీలో చీలికలు వస్తే ఏ వర్గానికి ఎక్కువ సభ్యులున్నారో ఆ వర్గానికే పార్టీ చిహ్నం కేటాయించాల్సి ఉంటుందని అన్నాడీఎంకే తన వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ సంఘానికి కాల నిర్ణయాన్ని ప్రకటించాలని ఈపీఎస్ తరఫున కోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28 మధ్యాహ్నం 3 గంటలకు తమ కార్యాలయంలో జరుగనున్న విచారణకు స్వయంగా హాజరుకావాలంటూ ఈపీఎస్, ఓపీఎ్‌సకు, పిటిషనర్ సూర్యమూర్తి తదితరులకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది.
23న ఎడప్పాడి నివాసంలో ఎమ్మెల్యేలకు విందు...
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులకు ఈ నెల 23 రాత్రి మెగా విందును ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఖరారైన సందర్శంగా ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించేందుకు పార్టీలో అందరినీ సంతృప్తిపరిచే రీతిలో ఈ విందు కార్యక్రమాలుంటాయని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News