CBI: మాజీసీఎం బంధువు నివాసంలో సీబీఐ సోదాలు
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:00 PM
మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం సమీప బంధువు, సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం(Former Chief Minister O. Panneerselvam) సమీప బంధువు, సముద్ర భూగర్భ పరిశోధనా, హార్బర్ నిర్మాణ పనుల కంపెనీకి చెందిన కార్యాలయం, నివాసాల్లో సీబీఐ(CBI) అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. తేనాంపేట(Tenampet)లోని కేపిటల్ టవర్‌లో జాన్ టి నల్ అనే పేరుతో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ సముద్రగర్భ పరిశోధనలు, హార్బర్ నిర్మాణ పనులను చేపడుతుంది.
ఈ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ అధికారులు శుక్రవారం ఈ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం బంధువు చూలైమేడు భజనై కోయిల్ వీధికి చెందిన సుకుమార్ నివాసంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల తర్వాతే వీరు పాల్పడిన అక్రమాల వివరాలు బహిర్గతం వెల్లడికానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News