Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:28 PM
Varanasi: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వ రంగం సంస్థల వద్ద భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. వారణాసిలో కెనడా జాతీయులు తీవ్ర గందరగోళం సృష్టించాడు.

వారణాసి, ఏప్రిల్ 28: విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే తన బ్యాగులో బాంబు ఉందని.. ఇది పేలిపోనుందంటూ ఓ వ్యక్తి బిగ్గరగా అరిచాడు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది సైతం తీవ్ర ఆందోళన చెందారు.దీంతో విమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి వేసి.. దాదాపు 4 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో సదరు వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.
అనంతరం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం రాత్రి వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. వారణాసి నుంచి బెంగళూరు బయలుదేరిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకొందని నగర ఏసీపీ ప్రతీక్ కుమార్ వెల్లడించారు. ఈ గందగోళానికి కారణమైన జాతీయుడు నిషాంత్ యోహంతన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు.
విమానంలో తనిఖీలు కారణంగా.. దాదాపు నాలుగు గంటలపాటు ఎయిర్ పోర్ట్‌లో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఇక నిషాంత్ యోహంతన్ విషయాన్ని భారత్‌లోని కెనడా రాయబార కార్యాలయ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఏసీపీ ప్రతీక్ కుమార్ వివరించారు.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర అప్రమత్తమైంది. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కార్యాలయాలతోపాటు ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. బాంబులు పెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు, భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతున్నారు. ఆ క్రమంలో కెనడా జాతీయుడు ఇలా చేయడంతో.. పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ఉపక్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
For National News And Telugu News