Brothers Same Bride Wedding: వధూవరులు
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:25 AM
ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని వివాహమాడారు...! అవును ఇది నిజమే.. అదేమిటి వారేమైనా చదువు సంధ్యలు

ఒకే యువతిని పెళ్లాడిన అన్నదమ్ములు!
ప్రదీప్ నేగి ప్రభుత్వ ఉద్యోగి, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తమ్ముడు కపిల్ నేగి
హట్టి తెగలో కుటుంబాలు కలిసికట్టుగా ఉండేందుకే ఈ సంప్రదాయం
హిమాచల్‌ప్రదేశ్‌లో దశాబ్దాలుగా పాటింపు
న్యూఢిల్లీ, జూలై 20: ఇద్దరు అన్నదమ్ములు ఒకే యువతిని వివాహమాడారు...! అవును ఇది నిజమే.. అదేమిటి వారేమైనా చదువు సంధ్యలు లేనివారనుకుంటున్నారా? కానే కాదు.. చదువుకుని ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా.. మరొకరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. మరి ఎందుకిలా..? హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ తెగ సంప్రదాయం ఇది. ఆ రాష్ట్రంలోని సిర్మార్ జిల్లా షిలాయి గ్రామంలో ఈ వివాహం జరిగింది. ఇక్కడ హట్టి తెగకు చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అనే యువతిని తమ తెగ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ప్రదీప్ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, అతడి తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ వివాహం తమ ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని ముగ్గురూ చెప్పడం విశేషం. వీరి వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి చర్చకు దారితీసింది. ఇలా ఒకరు ఇద్దరిని వివాహం చేసుకోవడం భారత్‌లో చట్టవిరుద్ధం అయినా హిమాచల్‌ప్రదేశ్‌లో సిర్మార్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అలాగే కిన్నూర్, లాహాల్ స్పితి జిల్లాల్లో, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈ విధానం ఉంది. హట్టి తెగకు చెందినవారు ఇది తమ సంప్రదాయమని చెబుతున్నారు. జోడిదారణ్ లేదా ద్రౌపది ప్రథగా ఈ సంప్రదాయాన్ని వారు పిలుస్తారు. ఇటీవలే ఈ తెగవారికి గిరిజన తెగ(ఎస్టీ) హోదా కూడా వచ్చింది. కాగా, సెంట్రల్ హట్టి కమిటీ న్యాయ సలహాదారు అయినరణ్‌సింగ్ చౌహాన్ అనే న్యాయవాది మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం హిమాచల్‌ప్రదేశ్‌లో కొనసాగుతోందని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు కూడా దీన్ని గుర్తించిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News